🌿 IBS vs IBD – తేడా ఏమిటి? తెలుసుకోండి…

Latest Comments

No comments to show.

IBS అంటే(Irritable Bowel Syndrome)
&
IBD అంటే(Inflammatory Bowel Disease)

ఈ రెండు వ్యాధులలో లక్షణాలు దాదాపు ఒకే విధంగా కనిపించినా… ఒకటి(IBD) ఎక్కువ శారీరికమైనది, ఇంకోటి(IBS) ఎక్కువ మానసికమైనది.

🧠 IBS అంటే ఏమిటి?
IBS అంటే Irritable Bowel Syndrome – ఇది ఒక Functional Disorder. అంటే, పేగులు గాయపడకపోయినా, పేగు లోపల పూత లేదా అల్సర్ లేకపోయినా లక్షణాలు కనపడుతుంటాయి

🧬 IBD అంటే ఏమిటి?
IBD అంటే Inflammatory Bowel Disease – ఇది ఒక ఆర్గానిక్ వ్యాధి, అంటే పేగు లోపల (inflammation) ఉండే పరిస్థితి. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్య.

🔍 IBS మరియు IBDలో సాధారణంగా కనిపించే లక్షణాలు:

  • తరచూ మోషన్‌కి పోవడం
  • కడుపులో నొప్పి
  • బరువు తగ్గడం
  • మానసిక ఆందోళన, ఉద్వేగం
  • అరుగుదల లోపం
  • మల విసర్జనలో మార్పులు

అయితే… ఈ లక్షణాలు ఉమ్మడి అయినా తేడా తలపెట్టాల్సిన భాగం ఇది 👇

💥 ప్రధాన తేడాలు: IBS vs IBD
1️⃣ పరీక్షలలో కనిపించే తేడా
IBSలో ఎలాంటి శారీరక గాయం, పేగులలో ఇన్ఫ్లమేషన్, పూత కనిపించదు. Colonoscopy, Endoscopy, Scan చేస్తే అన్నీ నార్మల్‌గా ఉంటాయి.

IBDలో మాత్రం పేగుల గోడలపై స్పష్టమైన పూత (inflammation), కనిపిస్తుంది. ఇది పేగుల లోతులో ఉండే ఒక రకమైన గాయమే.

మూలకారణం
IBS కు మానసిక ఆరోగ్యం (stress, anxiety) ముఖ్య కారణాలుగా భావిస్తారు.

IBD కు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ లోపం (autoimmune reaction), జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు.

చికిత్స విధానం
IBS and IBD రెండింటిలోనూ మెరుగైన ఫలితాలు ఆహార నియంత్రణ, జీవనశైలి మార్పులు, మానసిక ప్రశాంతత వల్ల వస్తాయి.

ప్రభావం
IBS and IBD రెండు అనేవి జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయి

ఒకే symptoms ఉన్నా, ఒకటి కనిపించదగిన వ్యాధి (IBD), మరొకటి కనిపించని, కాని బాధించే సమస్య (IBS).

📢 చివరగా:
👉🏼 మీరు లేదా మీ దగ్గరవాళ్లు పేగు సమస్యలతో బాధపడుతున్నారు అంటే – స్వయంగా ఊహించుకోకుండా వైద్యుని సంప్రదించండి. IBS అనిపించినా, IBDగా మారకుండా జాగ్రత్త పడాలి.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed