💻 CYBER CHONDRIA అంటే ఏమిటీ? 🤔

Latest Comments

No comments to show.

ఇంటర్నెట్ లో మన ఆరోగ్యం లేదా వ్యాధి గురించి అతిగా తెలుసుకుని భయపడుతూ ఉండడమే ” సైబర్ కాండ్రియా” అంటారు

మీరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారా తెలియకుండానే?
ఈరోజు మనం ఒక అత్యంత అరుదైన కానీ వేగంగా పెరుగుతున్న మానసిక వ్యాధి గురించి తెలుసుకుందాం 👉 Cyberchondria

🌐 డిజిటల్ యుగంలో విపరీతంగా పెరుగుతున్న CYBERCHONDRIA అంటే?
మన ఆరోగ్యానికి సంబంధించి ఇంటర్నెట్ లో మనం చదివే సమాచారాన్ని మన శరీరానికి అన్వయించుకొని,
ఆ లక్షణాలు నా దగ్గర ఉన్నాయేమో అని అనుకొని,
అందులోనుంచి 😟 ఆతురత, భయం, డిప్రెషన్, ఒత్తిడి
లాంటివి పెరగడం 👉 CYBERCHONDRIA అంటారు.

ఈ మధ్య కాలంలో మనం ప్రతి చిన్న లక్షణాన్ని గూగుల్ లో వెతికి,
మనల్ని మనమే తప్పుగా డయగ్నోస్ చేసుకోవడం ఎక్కువైపోయింది.

❓ పాత రోజుల్లో ఎలా ఉండేది?
పాత రోజులలో:
✅ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించేవారు.
✅ డాక్టర్ మీరు చెప్పిన లక్షణాలు చూస్తారు
✅ నేరుగా శారీరక పరీక్ష చేస్తారు
✅ సరైన నిర్ధారణ చేసేవారు.

❗ ఇప్పుడు ఎలా మారింది?
ప్రస్తుతం డిజిటల్ యుగంలో:
🔸 ప్రజలు నేరుగా గూగుల్ ఓపెన్ చేస్తారు
🔸 Headache అని సెర్చ్ చేస్తారు
🔸 గూగుల్, Headache తో పాటు cancer, brain tumor, neurological disease లాంటి వేలాది వ్యాధులు చూపిస్తారు
🔸 మీరు చిన్న headache కి పెద్ద diseases attach చేసుకుని భయపడిపోతారు
🔸 ఇది self diagnosis, wrong interpretation.

⚡ CYBERCHONDRIA ఎలా హాని చేస్తుంది?
🔹 గూగుల్ లో symptom search
🔹 విస్తృతమైన & సాధారణ డేటా మీరు చదవడం
🔹 లక్షణాలు observe చేసి ఆతురత పెరగడం
🔹 విపరీతమైన భయం తో emergeny వైపు పరిగెత్తడం
🔹 డాక్టర్లు మిమ్మల్ని చూసి “సమస్య లేదు” అని చెప్పినా కూడా, కానీ మీరు డాక్టర్ మాట వినరు – గూగుల్ మీద నమ్మకం పెరిగిపోతుంది
🔹 Fear & Anxiety loop లో పడిపోతారు
🔹 చివరకు 👉 డిప్రెషన్ లోకి మునిగిపోతారు

💥 ఇది ఎంత ప్రమాదకరం?
🚨 గూగుల్ ని నమ్మడం వల్ల:
⚠️ అనవసరమైన ఒత్తిడి
⚠️ తీవ్రమైన ఆతురత
⚠️ Panic attacks
⚠️ మానసిక స్థిరత కోల్పోవడం
⚠️ జీవన నాణ్యత తగ్గిపోవడం
⚠️ చివరికి Generalized Anxiety Disorder (GAD) & Depression లోకి దిగడం

✅ ఉత్తమ మరియు సురక్షిత పరిష్కారం:
🔷 మీకు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు 👉
👉 నేరుగా పర్సనల్ ఫిజిషియన్ ని కలవండి
👉 లక్షణాలు వివరంగా చెప్పండి
👉 డాక్టర్ interpretation & diagnostic clarity ని నమ్మండి
👉 Self-diagnosis పూర్తిగా వదిలేయండి
👉 గూగుల్ ని general knowledge కోసం మాత్రమే ఉపయోగించండి, diagnosis కోసం కాదు

💡 ముఖ్యమైన విషయం:
👉 గూగుల్ విస్తృతమైన నాలెడ్జ్ ఇస్తుంది – కానీ మీ కోసం స్పెసిఫిక్ కాదు
👉 Headache అంటే cancer కాదు
👉 Fever అంటే covid కాదు
👉 సరైన నిర్ధారణ కోసం Professional help తప్పనిసరి
👉 Cyberchondria కి Say NO
👉 ఆరోగ్యంగా ఉండటానికి Correct information + Doctor guidance ఎప్పుడూ ఉత్తమం ✅

🚨 ముగింపు:
💻 డిజిటల్ యుగంలో cyberchondria బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
❌ గూగుల్ ని బ్లైండ్ గా నమ్మకండి
✅ డాక్టర్లు చెప్పినదే పాటించండి
✅ Self-diagnosis కి నో చెప్పండి
✅ హెల్దీ మైండ్, హెల్దీ లైఫ్ maintain చేయండి

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed