💥 సయాటికా వలన మడిమ షూల(నొప్పి)( plantar Fascitis) వస్తుందా?

Latest Comments

No comments to show.

ఇది చాలా మందిని గందరగోళానికి గురిచేసే ప్రశ్న.

ఎందుకంటే Sciatica మరియు Plantar Fasciitis రెండింటికీ కాలికి సంబంధించిన నొప్పులే — కానీ ఇద్దరి మూలాలు, లక్షణాలు వేరే!
ఇంకా, కొన్ని సందర్భాల్లో రెండూ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.

🧠 ముందుగా తెలుసుకోవాల్సింది: Sciatica అంటే ఏమిటి?
సయాటికా అనేది వెన్నెముక (lower back) నుండి ప్రారంభమై తొడ, మోకాలి కిందుగా, పాదం వరకు వ్యాపించే ఒక పెద్ద నరంపై ఒత్తిడి (compression) వల్ల కలిగే నరాల నొప్పి.
ఈ నరాన్ని Sciatic nerve అంటారు. దీని మీద ఒత్తిడి వచ్చినప్పుడు:
👉 నడుం నొప్పి
👉 కాలిలోకి జాలుగా వచ్చే నొప్పి
👉 తిమ్మిరి
👉 మొద్దుబారటం
👉నడకలో ఇబ్బంది
👉నిలబడలేకపోవడం
వంటి లక్షణాలు కనపడతాయి.

👣 మరి Plantar Fasciitis అంటే ఏమిటి?
ఇది పాదం అడుగు భాగంలో వచ్చే నొప్పి. ముఖ్యంగా:

ఉదయం పడక నుండి లేచిన వెంటనే అడుగు మడిమ వద్ద తీవ్ర నొప్పి

ఎక్కువ నడక, నిలబడటం వల్ల నొప్పి పెరగడం

కాలి అడుగున “ఫ్యాషియా” అనే టిష్యూ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి

ఈ పరిస్థితిని Plantar Fasciitis అంటారు.

👉 అయితే, Sciatica వలన మడిమ షూల వస్తాయా?
సాధారణంగా వీటి మూలాలు వేరే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో Sciatica వల్ల కలిగే మారిన నడక శైలి (gait), ఒత్తిడితో సహా:

ఒక కాలి మీద ఎక్కువ బరువు వేయడం

నడకలో అసమతుల్యత
సయాటిక వచ్చిన కాళ్ళో మజిల్ స్టిఫ్ అవడం వలన

కాళ్ళ మడిమలపై ఒత్తిడి పెరగడం

ఇవన్నీ క్రమంగా Plantar Fasciitis (మడిమ షూల) కి దారి తీసే అవకాశముంది.

🌿 ఆయుర్వేదం చెప్పేది ఏమిటి?
ఆయుర్వేద దృష్టిలో ఇవి రెండూ వాత దోష తీవ్రత వల్ల కలిగే వికృతులు. దీని పరిష్కారానికి శరీరంలోని వాతాన్ని శమనం చేయాలి.

శ్రీయం ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రత్యేకంగా నిర్వహించే చికిత్సలు:

🔸 Abhyanga – ఆయుర్వేద నూనెలతో నరాలకు శాంతి
🔸 Kati Basti – వెన్ను భాగంలో నూనె నిలిపి వేడి చికిత్స
🔸 Padabhyanga – మడిమలకు ఆయుర్వేద మర్ధన, అగ్నికర్మ
🔸 Nadi Sweda – Herbal steam therapy for deep tissue relaxation

🧘‍♂️ జాగ్రత్తలు & పునరావృతి నివారణ
✅ ఒకేచోట ఎక్కువసేపు కూర్చోకండి
✅ పాదాలకు సరైన మద్దతు కలిగిన షూస్ వాడండి
✅ సాధ్యమైనంతవరకూ నడక, వ్యాయామం కొనసాగించండి
✅ దీర్ఘాకాలిక నొప్పికి ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

CATEGORIES

Blog

Comments are closed