సయాటికా వున్నవారు జిమ్ చేయొచ్చా? పూర్తిగా తెలుసుకోవాలి!
సయాటికా అనేది సాధారణంగా నడుం నుండి కాలి అడుగు వరకు వచ్చే నరాల నొప్పి. ఇది సయాటిక్ నేర్వ్ ఒత్తిడి పడటంతో కలిగే సమస్య. ముఖ్యంగా disc bulge, slipped disc, spinal stenosis వంటివి దీనికి కారణాలు కావచ్చు.
ఈ పరిస్థితిలో ఉన్నవారు జిమ్ చేయాలా వద్దా అనే సందేహంతో ఉంటారు. అసలు జిమ్ చేయడం మంచిదేనా? లేదా ఇది సమస్యను ఇంకా పెంచుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇది.
✅ సయాటికా ఉన్నవారు జిమ్ చేయొచ్చా?
ఒకే పదంలో చెప్పాలంటే — నొప్పి తగ్గేవరకు అసలు జిమ్ చెయ్యకూడదు,నొప్పి తగ్గాక కూడా చాలా జాగ్రత్తలతో, గైడెన్స్ తో జిమ్ చెయ్యాలి!
జిమ్ అనే కాకుండా, కొన్ని ఎక్సర్సైజు లు సయాటిక నొప్పి తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి.
⚠️నొప్పి తగ్గాక జిమ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తీవ్రమైన నొప్పి ఉంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
లైట్ స్ట్రెచింగ్‌లు, వాక్ వంటివి చేయొచ్చు
వెయిట్ లిఫ్టింగ్ (Weight Training) అసలు చెయ్యకూడదు నొప్పి తగ్గాక కూడా
గట్టిగా వెయిట్స్ ఎత్తే వ్యాయామాలు తాత్కాలికంగా మానివేయాలి.
బాడీ మెకానిక్స్ తప్పితే నొప్పి మరింత పెరగవచ్చు.
Avoid High-Impact Workouts:
జంపింగ్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT), స్పిన్నింగ్ వంటివి నివారించాలి.
🧘♂️ ఏ వ్యాయామాలు సురక్షితమైనవి?
👉 సాధారణంగా నెమ్మదిగా చేసే ఈ వ్యాయామాలు చాలా మంచివి:
Cat-Cow Stretch: వెన్నెముకను హార్మొనిగా కదల్చే యోగా ఆసనం
Child Pose: నడుం, నరాలపై ఒత్తిడిని తగ్గించే Bridge Pose:
వెన్నెముకను బలపరచే విధంగా పనిచేస్తుంది
Pelvic Tilts
💡 ముఖ్యమైన సూచనలు:
జిమ్ చేయడం ప్రారంభించే ముందు డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
సరైన షూస్, సపోర్టివ్ బెల్ట్స్ వాడాలి.
నొప్పి పెరిగితే వ్యాయామం ఆపాలి.
✅ ముగింపు:
సయాటికా ఉన్నవారు నొప్పి టైం లో జిమ్ చేయకూడదు, కానీ తగు జాగ్రత్తలతో డాక్టర్/ ఫిజియో గైడెన్స్ తీసుకుంటూ ఫిట్‌నెస్ సాధనలో భాగంగా వ్యాయామం చేయడం మందులాంటి పాత్ర పోషిస్తుంది. అయితే సరైన దిశలో చేయకపోతే నష్టమే జరుగుతుంది.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com
🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

Comments are closed