ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఆరు రుచుల సమ్మేళనం అనగా తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. సహజంగా ఇది ప్రతి ఒక్కరి జీవిత అనుభవాలను సూచిస్తుంది. అంటే జీవితం అన్నది షడ్రుచుల సమ్మేళనం లాగ, అందరి జీవితంలో ఆనందం, ఉత్సాహం, బాధ, నేర్పు, సహనం మరియు సవాళ్లు తో కూడుకుని ఉంటుంది అన్నది దీని పరమార్థం.
మన నిత్య జీవితంలో కలిగే ఇలాంటి అనేక అనుభవాలను సమతుల్యంతో చూడటం ద్వారా ఈరోజు మన సమాజం ఎదురుకుంటున్న అనేక మానసిక రుగ్మతులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
ఇదే కాక ఉగాది పచ్చడి యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం మనం నిత్యం సేవించే ఆహారం కూడా ఆరు రుచుల సమ్మేళనం లాగానే ఉండాలి.
ఇలా సేవించడం ద్వారా మన శరీరం లోని త్రిదోషాలు అయినటువంటి వాత పిత్త కఫాలు సమతుల్యతలో ఉండటానికి దోహద పడతాయి.
The most important Food recipe which everyone consumes on the auspicious day of ugadi is Ugadi Pachadi which is a combination of 6 tastes i, e Sweet, sour, salt, pungent, bitter and astringent. Generally it defines the essence of everyones life experiences. The way this food has all different tastes everyones life has Happiness, sad, anger, patience, enthusiasm, challenges etc.
By perceiving all these different experiences in a balanced way one can lead a better balanced life in present scenario as well as this is the key to avoid various psychological related problems
One more importance for this ugadi pachadi is everyones food should consist all these tastes.
By consuming like this all the 3 doshas i, e Vata, pitta and kapha can be maintained in a balanced state.
Dr Nagendra,
Chief Physician & MD, SRIAM Ayurvedic Hospitals, Guntur, Palakollu, Hyderabad
Comments are closed